Revanth Reddy

Revanth Reddy: ముగిసిన రేవంత్ రెడ్డి, తెలుగు సినీ పరిశ్రమ మీటింగ్

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మరికొందరు ప్రముఖులు అంతా కలిసి ఈరోజు తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఆఫీసులో ఓ మీటింగ్ పెట్టుకుని భేటీ కావడం జరిగింది. అయితే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు, అలాగే టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు దృష్టిలో పెట్టుకుని ఈ మీటింగ్ ముగిసింది.

Revanth Reddy: ఈ సందర్భంగా ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు జరిగిన మీటింగ్ కు సంబంధించిన కీలక విషయాలను మీడియాతో మాట్లాడడం జరిగింది. “ముఖ్యంగా ఈ మీటింగ్ లో హైదరాబాదును సినిమాల పరంగా ఎలా అభివృద్ధి చెందేలా చూడాలి, అలాగే హాలీవుడ్ స్థాయిలో సినిమాలు ఇక్కడికి వచ్చి షూటింగ్ చేయాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై సినిమా ఇండస్ట్రీ నుండి కూడా ప్రభుత్వానికి సలహాలు కావాలంటూ చర్చించడం జరిగింది. నేడు తెలుగు సినిమాలు అంటే అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన కారణంగా ఇకపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అటు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అలాగే ఇటు హైదరాబాద్ ఇంకా తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనే విషయాలపై చర్చించుకున్నాము. బాలీవుడ్ సినిమాలు, కన్నడ, తమిళ సినిమాలు ఇప్పటికే ఇక్కడ షూటింగులు జరుగుతున్నారు.12

Revanth Reddy: అదేవిధంగా హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి వీలు పడేలా హైదరాబాదును అభివృద్ధి చేద్దామని దిశగా ఈ మీటింగ్ లో మాట్లాడుకోవడం జరిగింది. హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్ గా మారేలా ఇండస్ట్రీ అంతా ఒకసారి మాట్లాడుకుని ఇండస్ట్రీ తరపున తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ సలహాలు ఇస్తామని దిల్ రాజు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని అసాంఘిక చర్యలను దృష్టిలో పెట్టుకుని సినిమా వారు చెబితే ప్రజల దృష్టికి త్వరగా వెళుతుంది కాబట్టి సినిమా హీరోలు, అలాగే డైరెక్టర్లు డ్రగ్స్ ఇతర అటువంటి అసాంఘిక విషయాలపై ప్రజలకు అవగాహన కలిగేలా ప్రభుత్వానికి సహకరిస్తూ ఉండాలని అన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీ కావాల్సిన షూటింగ్ పర్మిషన్ వంటి అవసరాలను కూడా ప్రభుత్వానికి విన్నపించడం జరిగింది.

123

Revanth Reddy: ఈ మీటింగ్ అద్భుతంగా జరగడంతో అందరూ సీఎం గారికి పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. త్వరలోనే చర్చించుకున్న అంశాల పట్ల ఇండస్ట్రీ అంతా ఒకసారి మాట్లాడుకుని ప్రభుత్వంతో కలిసి ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాము. ప్రస్తుతం ఇటువంటి విషయాలపైనే ఈ మీటింగ్ లో మాట్లాడుకోవడం జరిగింది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు గురించి మాట్లాడడానికి సమయమే సమాధానం చెబుతుంది. ప్రస్తుతం హైదరాబాదును అంతర్జాతీయ స్థాయిలో సినిమా పరిశ్రమ పరంగా ఎదిగేలా చేసే పెద్ద విషయాలే మాట్లాడుకోవడం జరిగింది. వాటితో పోలిస్తే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేవి చాలా చిన్నవి. మరో 15 రోజుల్లో అటు ప్రభుత్వంకి అలాగే ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా ఎఫ్ డి సి చైర్మన్ గా త్వరలోనే దీనికి సంబంధించిన ఒక నివేదికను ప్రభుత్వానికి అందిస్తాను. అది నా కర్తవ్యం. త్వరలోనే మీడియా అందరినీ పిలిచి ఎఫ్ డి సి లో ఒక మీటింగ్ పెట్టుకుని మీ ప్రశ్నలు అన్నిటికీ అక్కడ సమాధానం ఇస్తాను అంటూ ముగించారు.

ALSO READ  Thums Up: మామయ్య నుంచి మేనల్లుడి దాకా ‘థమ్స్ అప్’!?

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *