JAAT 2

JAAT 2: జాట్ 2: సాలిడ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్!

JAAT 2: బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ “జాట్” సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ చిత్రం సన్నీ డియోల్ అభిమానులకు యాక్షన్‌తో కూడిన ఫుల్ మీల్‌గా నిలిచింది. వరల్డ్ వైడ్‌గా బలమైన వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ మూవీకి సీక్వెల్‌గా “జాట్ 2”ను మేకర్స్ గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు. దీంతో అభిమానుల్లో హైప్ డబుల్ అయ్యింది.గోపీచంద్ మలినేని తాజాగా ఇచ్చిన స్టేట్‌మెంట్ “జాట్ 2”పై అంచనాలను మరింత పెంచింది. ఈ సీక్వెల్‌లో మరిన్ని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ యాంగిల్ కూడా ఉంటాయని ఆయన కన్ఫర్మ్ చేశారు. “జాట్ 2” మొదటి పార్ట్‌ కంటే గట్టిగా ఉంటుందని, అభిమానులకు మరో మాస్ ట్రీట్ ఇస్తామని గోపీచంద్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రం 2027లో విడుదల కానుందని ఇన్‌సైడ్ టాక్. సన్నీ డియోల్ మార్క్ యాక్షన్, గోపీచంద్ డైరెక్షన్‌తో “జాట్ 2” బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jos Buttler: ఇంగ్లాండ్ దీన స్థితికి ప్రతీక..! కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన జోస్ బట్లర్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *