Jasprit Bumrah: రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరు అని అడిగినప్పుడు మొదటి సమాధానం జస్ప్రీత్ బుమ్రా. హిట్‌మ్యాన్ లేకపోవడంతో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించిన తర్వాత బుమ్రాకు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించాలని అంతా భావించారు. కానీ ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌కు జట్టును ప్రకటించినప్పుడు, శుభ్‌మాన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించారు. దీని తరువాత, బుమ్రాను విస్మరించడంపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ ప్రశ్నలకు జస్‌ప్రీత్ బుమ్రా ఇప్పుడు సమాధానం ఇచ్చాడు.
ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా.. తాను కెప్టెన్‌గా ఉండకూడదని వెల్లడించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ కావడానికి ముందు, ఐపీఎల్ సమయంలో నేను బీసీసీఐతో మాట్లాడినట్లు చెప్పాడు. ‘‘ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పనిభారం గురించి కూడా నేను చర్చించాను. నాకు వెన్నునొప్పి సమస్య ఉంది కాబట్టి నేను దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో రాబోయే సిరీస్‌కు నన్ను కెప్టెన్‌గా పరిగణించొద్దని చెప్పాను. దీనికి ప్రధాన కారణం నా పనిభారమే. ఎందుకంటే ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లోని 5 మ్యాచ్‌ల్లోనూ నేను ఆడగలనో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు’’ అని బుమ్రా అన్నాడు.
Also Read: Suryakumar Yadav: నో మ్యాచులు..గ్యాప్ ను వాడుకుంటున్న సూర్య కుమార్ యాదవ్..
సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా తనకు కెప్టెన్సీ ఇవ్వలేరనే వార్తలు అవాస్తవమని బుమ్రా స్పష్టం చేశాడు. వైద్యులు, నిపుణులతో చర్చించిన తర్వాత తానే కెప్టెన్సీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ‘‘ నేను ఎప్పుడూ జట్టుకే మొదటి స్థానం ఇచ్చే ఆటగాడిని. అందువల్ల, నాయకత్వం కంటే జట్టు ప్రయోజనాలే నాకు ముఖ్యం. అందుకే నేను నాయకత్వానికి నో చెప్పాను’’ అని బుమ్రా అన్నారు.
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పికి గురయ్యాడు. అందువల్ల, అతను ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీ పడలేదు. ఆ తర్వాత, అతను ఐపీఎల్‌లో కనిపించినా ఎక్కువ ఒత్తిడికి గురికావొద్దని డాక్టర్లు సలహా ఇచ్చారు. బుమ్రా ఇంగ్లాండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల్లో ఆడడం కూడా డౌట్ గానే కనిపిస్తుంది.

