Pawan Kalyan’s OG: సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ లను రంగంలోకి దింపుతోంద యూనిట్. ప్రముఖ థాయ్ నటుడు వితయ పన్ శృంగార్మ్, జపనీస్ నటుడు కజుకి కితామురా ఈ మూవీలో నటిస్తున్నట్లు సినిమాటోగ్రాఫర్ రవికె చంద్రన్ తెలియచేశారు. థాయ్ నటుడు వితయ ‘ఓన్టీ గాడ్ ఫర్గివ్స్’లో మెయిన్ విలన్ గా నటించి పేరు తెచ్చుకున్నాడు. ఇతడిని థాయ్ లాండ్ లో ‘ఖున్ పు’ అని పిలుస్తారట.
ఇది కూడా చదవండి: Manchu Vishnu: హాలీవుడ్ కి మంచు విష్ణు..50 మిలియన్ డాలర్ల డీల్..
Pawan Kalyan’s OG: ఇతను పవన్ ఓజీలో భాగం అయ్యాడు. ఇక జపనీస్ నటుడు కజుకి కితామురా అయితే ఎన్నో సినిమాల్లో నటించాడు. వాటిలో పేరెన్నిక గన్నది ‘కిల్ బిల్’ ప్రాంఛైజ్. ఇదే విషయాన్ని రవికె చంద్రన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం బ్యాంకాక్ లో యూనిట్ కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తోంది. పవన్ ఎప్పుడు ఈ షూట్ లో జాయిన్ అయ్యేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ పై ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు.