Janasena: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (2024 ) ఎన్నికల్లో అప్రతిహాత విజయం సాధించి, కూటమి అధికారంలో భాగస్వామ్యమైన జనసేన 12వ ఆవిర్భావం సందర్భంగా నిర్వహిస్తున్న సభ శుక్రవారం (మార్చి 14) సాయంత్రం 4 గంటలకు చిత్రాడ గ్రామంలో జరుగుతుంది. ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ సారధ్యంలో ఏర్పాటైన ఈ పార్టీ ఘోర వైఫల్యాల నుంచి విజయాల వైపునకు దూసుకువచ్చింది. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవిలో ఉండగా నిర్వహిస్తున్న ఈ వార్షిక సభను ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఈ సభకు జయకేతన సభ అని నామకరణం చేశారు.
Janasena: జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న చిత్రాడ గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ జరుగుతుంది. జాతీయ రహదారి పక్కన 50 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ సభకు ఆ పార్టీ ఏర్పాట్లను పూర్తిచేసింది. పవన్‌కల్యాణ్‌తో పాటు జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, పవన్ అభిమానులు లక్షల సంఖ్యలో తరలివచ్చేలా ఈ ఏర్పాట్లు చేశారు.
Janasena: జనసేన ఆవిర్భావ సభా వేదికపై పవన్‌కల్యాణ్‌తోపాటు 250 మంది ముఖ్య నేతల వరకు ఆసీనులయ్యేలా వేదికను సిద్ధం చేశారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన మూడు ద్వారాలకు ప్రముఖుల పేర్లను పెట్టడం విశేషం. రావు సూర్యారావు బహుదూర్ మహరాజ్, డొక్కా సీతమ్మ, మల్లాడి సత్యలింగ నాయకర్ పేర్లను పెట్టారు. తెలుగు చరిత్రకు అద్దంపట్టేలా ఈ సభ నిర్వహణకు జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో సభా వేదికను తీర్చిదిద్దారు.
Janasena: జనసేన జయకేతన సభ రాష్ట్ర చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిపోయేలా ఏర్పాట్లు ఉన్నాయని విశ్లేషకులు సైతం అభివర్ణించారు. 11 సంవత్సరాల పాటు మొక్కవోని దీక్షతో ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసి, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కూటమిని కట్టి అధికారంలోకి తేవడంలో జనసేనాని పవన్‌కల్యాణ్, జన సైనికులు విశేష కృషి ఉన్నదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అధికారంలోకి వచ్చాక తొలి సభను నభూతో నభవిష్యత్తు అనే రీతిలో ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే శుక్రవారం ఉదయం నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు చిత్రాడకు దారిపట్టారు. పలువురు చేరుకున్నారు. తిరుపతిలోని అలిపిరి గరుడ కూడలి వద్ద ప్రత్యేక పూజలు చేసిన కొందరు జనసైనికులు అక్కడి నుంచి పిఠాపురం బయలుదేరి వెళ్లారు.
జనసేన జయకేతన సభ ప్రత్యేకతలు
* పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో సభ
* అధికారంలోకి వచ్చాక తొలి సభ ఇదే
* 50 ఎకరాల విస్తీర్ణంలో సభా ఏర్పాట్లు
* సభ సాయంత్రం 4గంటలకు ప్రారంభం
* 250 మంది కూర్చునేలా వేదిక ఏర్పాటు
* ప్రాంగణ ప్రధాన ద్వారాలకు మహనీయుల పేర్లు
* సభా ప్రాంగణంలో 15 ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు
* సభకు 1700 మంది పోలీసులతో బందోబస్తు
* 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ
* చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల పార్కింగ్ సదుపాయం
* జనసేన సభ కారణంగా పిఠాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
* కాకినాడూ రూరల్ అచ్చంపేట నుంచి
శంఖవరం మండలం కత్తిపూడి వరకు ట్రాఫిక్ ఆంక్షలు