World Boxing Championships: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం పతకం వచ్చింది. ఇంగ్లాండ్ లివర్‌పూల్ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ జైస్మీన్ లంబోరియా స్వర్ణం పతకం సాధించి చరిత్ర సృష్టించింది. 57 కిలోల విభాగంలో పోటీపడిన ఆమె, పారిస్ ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ జూలియా స్జెరెమెటా (పోలాండ్)ను 4-1 తేడాతో ఓడించి భారత్‌కు తొలి బంగారు పతకాన్ని గెలిచింది.
బలమైన కమ్‌బ్యాక్
2024 పారిస్ ఒలింపిక్స్‌లో మొదటి రౌండ్‌లోనే ఓడిపోయింది. తర్వాత తనని తాను రెడీ చేసుకుంది జైస్మీన్, దాని ఫలితమే ఈ విజయం. దింతో తన కెరీర్‌కి కొత్త ఊపిరి తీసుకొచ్చింది. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను అన్నారు. ఒక సంవత్సరం పాటు శారీరకంగా, మానసికంగా శ్రమించి, నా టెక్నిక్‌ను మెరుగుపరుచుకున్నాను. ఆ కృషి ఫలించింది” అని జైస్మీన్ ఆనందం వ్యక్తం చేసింది.
విజయ పయనం
మార్చి 2025లో గ్రేటర్ నోయిడాలో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఉత్తమ బాక్సర్‌గా ఎంపిక అయ్యారు. కజకిస్తాన్‌లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ (స్టేజ్-2) లో స్వర్ణం అందుకుంది. జూలై 2025లో కజకిస్తాన్‌లోనే మరోసారి గోల్డ్ మెడల్ సాధించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో 60 కిలోల విభాగంలో కాంస్యం పతకం గెలిచింది. 2021 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. ఈ విజయాలన్నీ జైస్మీన్‌ను ఒక్కో మెట్టుగా మలిచి ప్రపంచ ఛాంపియన్ స్థాయికి చేర్చాయి.
ఇది కూడా చదవండి: KTR: తల రైలు కింద పెడతానన్నాడు
భారత బాక్సర్ల మెరుపులు
జైస్మీన్‌తో పాటు మరో ఇద్దరు భారత బాక్సర్లు కూడా పతకాలు సాధించారు. నుపుర్ షెరోన్ (+81 కిలోలు) – ఫైనల్‌లో పోలాండ్ బాక్సర్ అగాటా కాజ్‌మార్స్కా చేతిలో 3-2 తేడాతో ఓడిపోవడంతో సిల్వర్ మెడల్. పూజారాణి (80 కిలోలు) – బ్రాంజ్ పతకం అయితే, పురుషుల విభాగంలో భారత్ ఖాతాలో ఒక్క పతకం కూడా రాకపోవడం నిరాశ కలిగించింది.
భారత బాక్సింగ్‌కు చారిత్రక ఘనత
మొత్తం మూడు పతకాలతో ఈ సారి భారత్ బాక్సింగ్ ప్రపంచ వేదికపై తన ఆధిపత్యాన్ని చాటింది. ముఖ్యంగా జైస్మీన్ లంబోరియా గెలుచుకున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్ తొలి స్వర్ణం భారత బాక్సింగ్ చరిత్రలో కొత్త అధ్యాయం రాసింది.

