Jai shah: కోహ్లీ రిటైర్మెంట్ పై జై షా వైరల్ కామెంట్స్

Jai shah: టీమిండియా మాజీ కెప్టెన్‌, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా స్పందించారు. కోహ్లీ టెస్ట్ కెరీర్‌ను ప్రశంసలతో ముంచెత్తిన జై షా, అతని అద్భుత ప్రస్థానానికి శలాకలర్పించారు.

“విరాట్ కోహ్లీ, నీ అద్భుతమైన టెస్ట్ కెరీర్‌కు అభినందనలు. ఇప్పుడు టీ20 ఫార్మాట్ వేగంగా విస్తరిస్తున్న సమయంలోనూ, టెస్ట్ క్రికెట్‌ అనే క్రికెట్‌లో అత్యంత స్వచ్ఛమైన రూపానికి మీరు ఇచ్చిన ప్రాధాన్యత అభినందనీయం,” అని జై షా పేర్కొన్నారు.

కోహ్లీ ఆటగాడిగా క్రమశిక్షణ, అత్యున్నత ఫిట్‌నెస్ ప్రమాణాలు, నిబద్ధతతో నిండిన ఆటతీరును చూపిస్తూ, ఇతరులకి ఆదర్శంగా నిలిచాడని ఆయన కొనియాడారు. ప్రత్యేకించి, కోహ్లీ లార్డ్స్ మైదానంలో చేసిన ప్రసంగాన్ని జై షా గుర్తుచేశారు. “లార్డ్స్‌లో నీవు చేసిన ప్రసంగం నీ టెస్ట్ క్రికెట్‌పై ఉన్న ప్రేమ, గౌరవం, అంకితభావాన్ని స్పష్టంగా తెలియజేసింది. అది కేవలం శరీరంతో ఆడిన ఆట కాదు, హృదయంతో ఆడిన పోరాటం,” అని ఆయన అన్నారు.

కోహ్లీ తన దైన ఆటశైలితో టెస్ట్ క్రికెట్‌కు కొత్త వన్నె తీసుకొచ్చాడని, ఎంతోమంది యువతకు ప్రేరణగా నిలిచాడని జై షా అభిప్రాయపడ్డారు. కోహ్లీ వంటి క్రికెటర్ల వల్లే టెస్ట్ ఫార్మాట్‌కి జీవం లభిస్తోందని, భవిష్యత్తులోనూ అతని మార్గం అనేక ఆటగాళ్లకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Adi Srinivas: ఏసీబీ విచారణకు హాజరవ్వాలని కేటీఆర్‌ను డిమాండ్ చేసిన ప్రభుత్వ విప్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *