Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. ధన్ఖర్ ఆరోగ్య పరిస్థితిని అక్కడి వైద్యులు పరీక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని చెప్పారు. ఈ రోజు (మార్చి 9) తెల్లవారుజామున ఎయిమ్స్ కార్డియాక్ విభాగంలో ఆయనను చేర్చగా, వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి.
