Jagadeesh Reddy: బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలనుకున్నారంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పరోక్షంగా కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. నిన్న కవిత చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్ సహా ఆ పార్టీలో ఏ ఒక్కరూ కూడా అంతగా స్పందించలేదు. తాజాగా జగదీశ్‌రెడ్డి గట్టిగా ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
Jagadeesh Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాదు కదా.. పొత్తు కూడా ఉండదని గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్‌ను ప్రశ్నిస్తే నష్టపోతారని కవితకు వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధినాయకుడు, తెలంగాణకు మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అలాంటి నేతను చులకన చేయొద్దని హితవు పలికారు.
Jagadeesh Reddy: మహానాడులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు కూడా జగదీశ్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో అభివృద్ధిని తానే చేశానన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాఖ్యలు హాస్యాస్పదమని కొట్టిపారేశారు. చెప్పిన మాటలనే పదే పదే చెప్తే అవే నిజమవుతాయనే ఉద్దేశంతో ఆయన ఇలాంటి వ్యాఖ్యలను తరచూ చేస్తున్నట్టున్నారని జగదీశ్‌రెడ్డి చెప్పారు.