IPL 2025

IPL 2025: ఐపీఎల్ మెగా వేలంలో భారత క్రికెటర్లపై ఈసారి కాసుల వర్షం

IPL 2025: ఐపీఎల్ మేగా వేలంలో భారత క్రికెటర్లపై ఈసారి కాసుల వర్షం కురవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. రూ. 21 కోట్ల కనీస ధరతో 23 మంది భారత స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఈ మెగా వేలంలో మొత్తం 1574 మంది ప్లేయర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా.. 1165 మంది ఇండియా ప్లేయర్లు నమోదు చేసుకున్నారు. 

IPL 2025: ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మెగా వేలానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ఇందులో భారత్‌ నుంచి 23 మంది ప్లేయర్లు రూ. 2 కోట్ల కనీస ధరతో పాల్గొననున్నారు. 

IPL 2025: రిషబ్‌ పంత్, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లతో పాటు… చాలా రోజుల నుంచి జాతీయ జట్టుకు దూరమైన ఉమేశ్‌ యాదవ్, భువనేశ్వర్‌ కుమార్, నటరాజన్‌ వంటి వాళ్లూ ఈ జాబితాలో ఉన్నారు. ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌తో పాటు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా, వెంకటేశ్‌ అయ్యర్, దేవదత్‌ పడిక్కల్‌ కూడా తమ కనీస ధరను రెండు కోట్లుగా నమోదు చేసుకోవడం విశేషం. టాప్ ఇండియన్ బౌలర్లలో శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకుంటున్న సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ, హైదరాబాద్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్, హర్షదీప్ సింగ్, ముకేశ్‌ కుమార్, అవేశ్‌ ఖాన్, ఖలీల్‌ అహ్మద్, హర్షల్‌ పటేల్, దీపక్‌ చహర్, శార్దూల్‌ ఠాకూర్, హర్షల్‌ పటేల్, ప్రసిధ్‌ కృష్ణ, వాషింగ్టన్‌ సుందర్, అశ్విన్‌, యుజువేంద్ర చహల్‌ కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి: Team India: టీం ఇండియాలో ది బెస్ట్ ఎవరంటే.. ?

IPL 2025: ఈ మెగా వేలంలో మొత్తం 1574 మంది ప్లేయర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వేలంలో పేర్లు నమోదు చేసుకున్న వారిలో 1165 మంది భారతీయ ప్లేయర్లు, 409 మంది విదేశీయులు ఉన్నారు. దక్షిణాఫ్రికా నుంచి అత్యధికంగా 91 మంది ప్లేయర్లు పోటీలో ఉండగా… ఆ్రస్టేలియా నుంచి 76 , ఇంగ్లండ్‌ నుంచి 52, న్యూజిలాండ్‌ నుంచి 39, వెస్టిండీస్‌ నుంచి 33 మంది  ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్నారు. ఇటలీ, యూఏఈ నుంచి ఒక్కో ప్లేయర్‌ తమ పేరు నమోదు చేసుకున్నారు.  కనీస ధర నిర్ణయించుకునే అవకాశం ఆటగాళ్లదే కాగా… ఒక్కో జట్టు గరిష్టంగా 25 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. టెస్టు క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంగ్లండ్‌ టెస్టు జట్టు సారథి బెన్‌ స్టోక్స్‌ ఈసారి ఐపీఎల్‌ వేలానికి దూరం కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ తొలిసారి ఐపీఎల్‌ వేలం కోసం రూ. 1 కోటి 25 లక్షల కనీస ధరతో  తన పేరు నమోదు చేసుకోవడం గమనార్హం. 

ALSO READ  Hair Cut: ఏ రోజుల్లో కటింగ్ చేసుకుంటే మంచిది

IPL 2025: గత వేలంలో రూ. 24 కోట్ల 50 లక్షలు అత్యధిక ధర  పలికిన ప్లేయర్‌గా నిలిచిన ఆ్రస్టేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌తో పాటు, మినీ వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా ఆఫ్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌ రూ. 2 కోట్ల ప్రాథమిక ధరలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 2023లో చివరిసారి ఐపీఎల్లో పాల్గొన్న ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ కూడా రూ. 2 కోట్ల కనీస ధరతో వేలానికి వస్తున్నాడు. గత వేలంలో అమ్ముడిపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయిన ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌తో పాటు… పేలవ ఫామ్‌తో ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా ఈసారి వేలంలో రూ. 75 లక్షల ప్రాథమిక ధరతో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. తొలిసారిగా ఇటలీ పేసర్‌ థామస్‌ డ్రాకా ఐపీఎల్‌ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. వేలంలో పేరు నమోదు చేసుకున్న తొలి ఇటలీ ప్లేయర్‌గా డ్రాకా నిలిచాడు.. ఐఎల్‌ టి20 లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీకి చెందిన ముంబై ఎమిరేట్స్‌ జట్టుకు డ్రాకా ఆడాడు.  ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ సందర్భంగా ఆకట్టుకున్న భారత సంతతికి చెందిన అమెరికా బౌలర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌పై అందరి దృష్టి నిలవనుంది. అండర్‌–19 స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత మెరుగైన ఉపాధి కోసం అమెరికా వెళ్లి స్థిరపడి అక్కడ అటు ఉద్యోగంతో పాటు ఇటు క్రికెట్‌లో రాణిస్తున్న నేత్రావల్కర్‌ కూడా రూ. 30 లక్షల ప్రాథమిక ధరతో వేలానికి వస్తున్నాడు. దీంతో ఈసారి మెగా వేలంలో ప్లేయర్లపై కాసుల వర్షం కురవనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *