బీరూట్: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. హిజ్బుల్లా మిలిటెంట్లతో పోరాడుతుండగా ఎనిమిది మంది తమ సైనికులు మరణించారని ఇజ్రాయెల్ బుధవారం తెలిపింది. కెప్టెన్ హరెల్ ఎటింగర్, కెప్టెన్ ఇటాయ్ ఏరియల్ గియాట్, స్టాఫ్ సార్జెంట్ నోమ్ బార్జిలే, స్టాఫ్ సార్జెంట్ ఓర్ మాంట్‌జుర్, స్టాఫ్ సార్జెంట్ నాజర్ ఇట్‌కిన్, సార్జెంట్ అల్మ్‌కెన్ టెరెఫే, సార్జెంట్ ఇడో బ్రోయర్‌లు దక్షిణ లెబనాన్ దాడిలో మరణించారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
మంగళవారం రాత్రి ఇరాన్, ఇజ్రాయిల్ పై వందలాది మిస్సైళ్లతో విరుచుకుపడింది. బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఓవైపు అమెరికా హెచ్చిరించినా లెక్కచేయకుండా మిసైల్స్ వర్షం కురిపించింఆది. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయిల్, దేశవ్యాప్తంగా సైరెన్ మోగించి ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రకటించింది. అదే సమయంలో ఐరన్ డొమ్స్ తో ఇరాన్ క్షిపణులను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఇరాన్– ఇజ్రాయిల్ దాడులతో పశ్చిమాసియా దేశాల్లో యుద్ధవాతారణం నెలకొంది. దాడులు అనంతరం స్పందించిన ఇరాన్.. ఇజ్రాయిల్ తిరిగి ప్రతీకార దాడులకు పాల్పడితే తీవ్ర పరిణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.