Nani

Nani: పెద్ద ప్లానే..న్యాచురల్ స్టార్ ప్యారడైజ్ లో పీపుల్ స్టార్?

Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘హిట్-3’ చిత్రాన్ని వేసవి రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు నాని. ఇక ‘ది ప్యారడైజ్’ అనే రా అండ్ రస్టిక్ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల్లో సాలిడ్ హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడనే వార్త వినిపిస్తోంది. ఇటీవల శ్రీకాంత్ ఓదెల ఆర్.నారాయణమూర్తిని కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ప్యారడైజ్ సినిమాలో ఓ సాలిడ్ పాత్రను ఆయనకు శ్రీకాంత్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ‘టెంపర్’ సినిమాలో పోసాని చేసిన పాత్రను దర్శకుడు పూరి జగన్నాధ్ నారాయణమూర్తికి చెప్పాడట. కానీ, ఆయన ఆ పాత్రను తిరస్కరించారు. మరి ఇప్పుడు ప్యారడైజ్ సినిమాలో నారాయణమూర్తి నటిస్తాడా.. అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Retro: రెట్రో రన్ టైం ఎంతంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *