Krishna District: పాపం..ఆ పసి ప్రాణం ప్రేమ కోసం ప్రాణాలను విధించింది అని చెబుతున్నా..ప్రేమ అనే పదానికి పూర్తిగా అర్తం తెలియని వయసు అది. కానీ..కాలం కలిసి రాలేదు..చనిపోయాడు. చనిపోయాడు సరే …ఆ బిడ్డ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి ? చదివి , పైకి వస్తాడు అనుకుంటే…కానరాని దూరం అంత పైకి వెళ్ళిపోయాడు. ప్రేమించడం తప్పు కాదు. కానీ ఆ ప్రేమకంటూ ఒక టైం ఉంటుంది . అంతెందుకు ..చదివి వుద్యోగం వస్తే ..అన్ని ఏవ్ రన్నింగ్ రేసులో వస్తాయి.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులోని NRI కాలేజీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాలేజీలో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గుర్రం వేణునాధ్.తోట్లవల్లూరు మండలం గురువిందపల్లి గ్రామానికి చెందిన గుర్రం వేణునాధ్..అనుమానాస్పదంగా మృతి చెందడంతో కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.
ప్రేమ వ్యవహారమే అత్మహత్యకు కారణమని ఎన్‌ఆర్‌ఐ సిబ్బంది తెలిపారు. సూసైడ్ నోట్ కూడా దొరికిందని చెబుతూ.. చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, చేతి రాత తమ అబ్బాయిది కాదు అని కుటుంబసభ్యులు చెబుతున్నారు. కొడుకును విగతజీవిగా చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.