Bhavani Ward 1997: హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలకు డిమాండ్ మామూలుగా ఉండదు. ఈ సినిమాలు ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తూ కాసుల వర్షం కురుస్తుంటాయి. తాజాగా ఈ జోనర్లో ‘భవానీ వార్డ్ 1997’ చిత్రం రాబోతోంది. జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీకి జీడీ నరసింహా దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు అన్నీ కూడా అంచనాలు పెంచేశాయి. ఇక సోమవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరిపారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ.. అందరినీ భయపెట్టేలా, అందరినీ థ్రిల్‌కు గురి చేసేలా తమ సినిమా ఉంటుందని తెలిపింది. ఈ మూవీ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్‌కానుంది.
