Darshan

Darshan: ఇలా ఉండటం కంటే ఉరిశిక్ష వేయండి.. కోర్టుకు దర్శన్ లాయర్ విజ్ఞప్తి

Darshan: అభిమాని హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. జైలులో తనకు కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని, వరుస బెయిల్ తిరస్కరణలతో తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దర్శన్ తరపు న్యాయవాది సునీల్, ఈ విషయాన్ని తాజాగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల్లో తన క్లయింట్‌ను ఇలా జైలులో ఉంచడం కంటే, విచారణను వేగంగా ముగించి, ఉరిశిక్ష వేసినా సరే, దాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నానని దర్శన్ ఆవేదనతో తెలిపినట్లు న్యాయవాది కోర్టుకు వివరించారు.

జైలులో కనీస సదుపాయాల కూడా లేవు దర్శన్ న్యాయవాది కోర్టులో చేసిన వాదనలు సంచలనం సృష్టించాయి:

  • సదుపాయాల తిరస్కరణ: జైలు అధికారులు దర్శన్‌కు ఖైదీలకు ఇవ్వాల్సిన కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని, ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా అధికారులు పట్టించుకోలేదని సునీల్ ఆరోపించారు.
  • బెయిల్ తిరస్కరణ: ఇప్పటికే 20 సార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టులు పరిగణనలోకి తీసుకోకపోవడంతో దర్శన్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు.

ఇది కూడా చదవండి: Mass Jathara: రవితేజ కోసం సూర్య.. మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ రచ్చ రచ్చే..!

  • మానసిక ఒత్తిడి: కనీస సౌకర్యాలు లేక, వరుసగా బెయిల్ తిరస్కరణలతో దర్శన్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
  • వెన్నునొప్పి సమస్య: దర్శన్‌కు వెన్నునొప్పి సమస్య మళ్లీ తీవ్రమైందని, గతంలో “తనకు సైనేడ్ ఇచ్చినా తిని ఆత్మహత్య చేసుకుంటా” అని దర్శన్ చెప్పిన వ్యాఖ్యలను కూడా న్యాయవాది ఈ సందర్భంగా గుర్తు చేశారు.

న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 29వ తేదీకి వాయిదా వేసింది. దర్శన్ పట్ల జైలు అధికారులు అనుసరిస్తున్న తీరుపై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో అనేది ఉత్కంఠగా మారింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *