IndiGo flight

IndiGo flight: వడగండ్లతో ఇండిగో విమానానికి రంధ్రం.. భయాందోళనలో ప్రయాణికులు!

IndiGo flight: బుధవారం సాయంత్రం దేశం వ్యాప్తంగా వాతావరణం ఉలికిపాటుకు గురిచేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో అకస్మాత్తుగా మారిన వాతావరణం — బలమైన ఈదురు గాలులు, వడగళ్ల వర్షం భయానక దృశ్యాలను తలపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 విమానానికి గాల్లో తీవ్ర కుదుపులు తగిలాయి. ఈ ఘటనలో ప్రయాణికులు మృతిని ఎదుర్కొన్న అనుభూతిని పొందారు.

ఘటన వివరాలు ఇలా ఉన్నాయి:

బుధవారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇండిగో విమానం కొద్దిసేపటికే వాతావరణం ప్రతికూలంగా మారింది. తుపానుగాలులు, భారీ వడగళ్ల వాన కారణంగా విమానం గాల్లోకి వెళ్లిన వెంటనే భారీ కుదుపులకు లోనయ్యింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరిచి వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి శ్రీనగర్ ATCతో సమన్వయం చేశాడు.

227 మంది ప్రయాణికులతో గాల్లో తేలియాడుతున్న ఆ విమానం క్షణాల్లో భయానక అనుభూతిని మిగిల్చింది. కొందరు ప్రార్థనలు చేస్తుంటే, మరికొందరు భయంతో అరుస్తూ సీట్లు బలంగా పట్టుకున్నారు. పైలట్ సాహసపూరితంగా విమానాన్ని శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే విమానం ముందు భాగం (నాక్) తీవ్రంగా దెబ్బతినడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Hanuman Jayanti 2025: 40 రోజుల హనుమాన్ ఉపవాస వ్రతంతో.. మీ జీవితాలే మారిపోతాయి

ప్రయాణికుల అనుభవం 

ఈ విమానంలో ప్రయాణించిన టీఎంసీ ఎంపీలు సాగరికా ఘోష్, డెరెక్ ఓ’బ్రెయిన్, మమతా బాలా ఠాకూర్, నదిముల్ హక్‌లతో పాటు మిగతా ప్రయాణికులు ఈ సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “మరణాన్ని దగ్గరగా చూశాం. గాల్లో ఆ కుదుపులు అసాధారణం. పైలట్ అందరినీ సురక్షితంగా తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నాం. విమానం ల్యాండ్ అయ్యేటప్పటికి ముందు భాగం ఊడిపోయినట్టే ఉంది!” అని ఓ ప్రయాణికుడు వెల్లడించారు.

ఒక ప్రయాణికుడు తన ఫోన్‌లో గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికులు ఎదుర్కొన్న భయాన్ని వీడియోగా రికార్డ్ చేశారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇండిగో స్పందన

ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పైలట్, క్యాబిన్ సిబ్బంది ప్రోటోకాల్స్‌ను పాటించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడాన్ని కొనియాడారు. ప్రయాణికులందరిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చడంలో సిబ్బంది ప్రదర్శించిన చిత్తశుద్ధికి సంస్థ కృతజ్ఞతలు తెలిపింది.

WordsCharactersReading time
WordsCharactersReading time

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *