Indians: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మన దేశం నుంచి విదేశీ వలసలు ఏటేటా పెరుగుతూ వస్తున్నాయి. విద్యాభ్యాసం, ఉపాధి, వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఈ వలసలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన ఎందరో యువత ఆయా దేశాల్లోనే స్థిరపడిపోతున్నారు. అక్కడే ఉపాధి పొందుతున్నారు. ఆ వరుసలో అమెరికా దేశంలో నివాసం ఉంటున్న భారతీయుల సంఖ్య అమాంతం పెరిగింది. అత్యధిక భారతీయులున్న దేశాల్లో అమెరికా దేశం ప్రథమ స్థానంలో ఉన్నది.
Indians: అమెరికా దేశంలో 54,09,062 మంది భారతీయులు ఉన్నారు. ఆ తర్వాత యూఏఈలో 35,68,848 మంది, మలేషియాలో 29,14,127 మంది, కెనడా 28,75,954, సౌదీ అరేబియాలో 24,63,509, మయన్మార్‌లో 20,02,660, యూకేలో 18,64,318, దక్షిణాఫ్రికాలో 17,00,000 మంది భారతీయులు నివాసం ఉంటున్నారు. ఇప్పటికీ అమెరికా సహా ఆయా దేశాలకు భారతీయుల వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ సంఖ్య ఏటేటా పెరుగుతూ పోతున్నది.