Sahiba: విజయ్ దేవరకొండ నటించిన ‘సాహిబా’ వీడియో అల్బమ్ గ్లింప్స్ విడుదలైంది. ఈ మ్యూజిక్ ఆల్బమ్ లో బాలీవుడ్ హీరోయిన్ రాధిక మదన్ విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్ ను ప్రముఖ బాలీవుడ్ సింగర్ జస్లీన్ రాయల్ పాడటం విశేషం. ఇటీవల దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండతో జస్లీన్ ఉన్న పికస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జస్లీన్ ఇప్పటికే ‘హీరియే…’ పాటతో ఎంతో ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఈ మ్యూజిక్ ఆల్బమ్ కూడా అంతకు మించి సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నారు. తాజాగా విడుదలైన ‘సాహిబా’ ఆల్బమ్ గ్లింప్స్ తోనే ఆకట్టుకుంటోంది. 15వ తేదీన ఫుల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. గ్లింప్స్ ‘హీరియే’ సాంగ్ బీట్ తో మొదలవుతుంది. ఇందులో విజయ్ దేవరకొండ కెమెరామేన్ గా బాధ్యత నిర్వహిస్తూ కనిపిస్తాడు. ఆ తర్వాత షూట్ కి రెడీ అవుతున్న హీరోయిన్ రాదిక గాగ్రా ను సర్దుతూ ఉంటాడు. చివరగా రాధిక డాన్స్ తో ఈ గ్లింప్స్ ఎండ్ అవుతుంది. గ్లింప్స్ తోనే ‘సాహిబా’ రాకకోసం ఈగర్ గా విడుదల చేస్తున్నామని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి పుల్ సాంగ్ తో ‘సాహిబా’ ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.

