Kamal Haasan: తనను స్టార్ అని పిలవద్దని, కమల్ హాసన్ అంటే చాలని ట్వీట్ చేశారు నటుడు కమ లహాసన్. సినిమా విషయంలో తాను నిత్యవిద్యార్థినంటూ కామెంట్ చేశారు.. ఆయన ఏమన్నారంటే.. ‘నా పనిని మెచ్చి ‘ఉలగనాయగన్’ లాంటి ఎన్నో బిరుదులు ఇచ్చినందుకు థ్యాంక్యూ. ప్రేక్షకులు, సహ నటీ నటులు, ఆత్మీయులు నుంచి ఇలాంటి ప్రశంసలు నన్నెంతగానో కదిలించాయి. సినిమా విషయంలో నేను నిత్య విద్యార్థిని. ఇండస్ట్రీలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలని, మరింత ఎదగాలని ఆశిస్తున్నా ను. కళ కంటే కళాకారుడు గొప్ప కాదనేది నా నమ్మకం. ఎంతో ఆలోచించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నాను. స్టార్ ట్యాగిన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నాను’ ‘నా అభిమానులు, మీడియా, సినీ ప్రము ఖులు.. నన్ను కమల్ హాసన్ లేదా కమల్ లేదా కేహెచ్ అని పిలవండి చాలు.
Kamal Haasan: ఎన్నో ఏళ్లుగా ఇలాంటి బిరుదులతో మీరు నా పై చూపించిన ప్రేమాభిమానాలకు థ్యాంక్స్. ‘అని కమల్ హాసన్ పేర్కొన్నారు. నటీనటులు స్టార్ ట్యాగ్స్‌ను దూరంపెట్టడం ఇది తొలిసారి కాదు. కోలీవుడ్‌కు చెందిన అజిత్ ఇప్పటికే ప్రకటించారు. తనని కేవలం అజిత్ కుమార్ లేదా అజిత్, ఏకే అని పిలవమని తెలిపారు. తెలుగులో నటుడు నాని స్టార్ ట్యాగ్స్‌పై వ్యతిరేకత వ్యక్తంచేశారు. తనని నేచురల్ స్టార్ అని కాకుండా కేవలం నాని అని మాత్రమే పిలమన్నారు.
உங்கள் நான்,
கமல் ஹாசன். pic.twitter.com/OpJrnYS9g2
— Kamal Haasan (@ikamalhaasan) November 11, 2024