Weather Update: కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్ర మట్టానికి కొద్ది ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. అలాగే, నైరుతి బంగాళాఖాతం, దానికి దగ్గరగా ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ వాతావరణ మార్పుల వల్ల రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:
* సోమవారం: చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయి.
* మంగళవారం: అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించవచ్చు.
Also Read: Vidadala Rajini: చిలకలూరిపేట ఎక్సైజ్ కార్యాలయం వద్ద మాజీ మంత్రి విడదల రజినీ నిరసన
* బుధవారం: అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులు ఉంటాయి.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:
* సోమవారం: అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయి.
* మంగళవారం: చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు.
* బుధవారం: అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు.
రాయలసీమ:
* సోమవారం: కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులు ఉంటాయి.
* మంగళవారం: చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులు ఉంటాయి.
* బుధవారం: అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులు ఉంటాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల కారణంగా వచ్చే ఇబ్బందుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.