IIIT Allahabad: అలహాబాద్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తెలంగాణ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ప్రయాగ్‌రాజ్‌లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న హాస్టల్ క్యాంపస్‌లోనే విద్యార్ది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణకు చెందిన వికలాంగ విద్యార్థి రాహుల్ మాదల చైతన్య అలహాబాద్ ట్రీపుల్ ఐటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
రాహుల్ పుట్టినరోజు కాగా.. ఒకరోజు ముందు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే రాహుల్ పరీక్షలో ఫెయిల్ అవడం వల్ల మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: Guntur: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో హృదయ విదారక ఘటన
రాహుల్ IIIT క్యాంపస్‌లోని తన హాస్టల్ ఐదవ అంతస్తు నుంచి కిందకి దూకాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసు సంఘటన స్థలానికి చేరుకుని రాహుల్‌ను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని ACP అజేంద్ర యాదవ్ తెలిపారు. ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో గత రెండు మూడు రోజులుగా విద్యార్థి తీవ్ర ఆవేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నాడని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
తెలంగాణలో నివాసం ఉంటున్న విద్యార్థి కుటుంబ సభ్యులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. రాహుల్ తల్లి స్వర్ణలత మాట్లాడుతూ.. తన కొడుకు నుండి చివరిసారిగా శనివారం రాత్రి తనతో మాట్లాడినట్లు తెలిపారు. తమ్ముడిని, తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ మెసేజ్ కూడా పంపించాడని కన్నీరుమున్నీరయ్యారు. ఆ మెసేజ్ చూసి భయపడి వెంటనే కాల్ చేసాను కానీ రాహుల్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చిందని అన్నారు.క్యాంపస్‌కు చేరుకున్న తర్వాతే రాహుల్ ఆత్మహత్య గురించి తమకు తెలిసిందని స్వర్ణలత రోధించారు.