Allu Arjun: టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న యంగ్ హీరో అల్లు అర్జున్ తాజాగా తన జీవితంలో అతిపెద్ద ప్రేరణ గురించి మనసు విప్పారు. ఆయన మాట్లాడుతూ.. “నా జీవితంలో అతిపెద్ద ప్రభావం చూపిన వ్యక్తి మా మామ, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన నాకు స్ఫూర్తి ప్రదాత. నా కెరీర్‌లో, వ్యక్తిగత జీవితంలో ఆయన ప్రభావం అనన్యం” అని అల్లు అర్జున్ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. చిరంజీవి.. తెలుగు సినిమా పరిశ్రమలో ఒక శకం.
Also Read: Janhvi Kapoor: తప్పతాగి బాలిక ప్రాణం తీసిన యువతి.. జాన్వీ కపూర్ సీరియస్
Allu Arjun: ఆయన నటన, సమాజసేవ, రాజకీయ ప్రస్థానం అందరికీ సుపరిచితం. అలాంటి దిగ్గజం నుంచి అల్లు అర్జున్‌కు ప్రేరణ రావడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. అల్లు అర్జున్ కూడా తనదైన స్టైల్‌తో ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. మరి, ఈ గురు-శిష్యులు మళ్లీ కలిసి ఓ సినిమాలో నటిస్తారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

