ICC CEO: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు కేవలం కొన్ని వారాల ముందు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనగా సీఈఓ జియోఫ్ అల్లార్డిస్ తన పదవి నుంచి తప్పుకున్నారు. పాకిస్థాన్‌లో టోర్నమెంట్ నిర్వహణలో ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో, అతని నిర్ణయం క్రికెట్ వర్గాల్లో అలజడి రేపింది. అల్లార్డిస్ రాజీనామాకు కారణాలను ఐసీసీ వెల్లడించలేదు కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహణ సమస్యలు, టోర్నమెంట్ సన్నాహాలలో అస్పష్టత ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయని భావిస్తున్నారు.
ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌లోని వేదికలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా సిద్ధం కాలేదు. కరాచీ, రావల్పిండి మైదానాలు ఇప్పటికీ నిర్మాణంలో ఉండటం, అక్కడి పరిస్థితులు అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడాలని నిర్ణయించుకోవడం పాకిస్థాన్ క్రికెట్ నిర్వహణపై మరింత ఒత్తిడి తెచ్చింది.
ఇది కూడా చదవండి: Olympic Games: ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వాలని ప్రయత్నిస్తున్న భారత్..! ఎప్పుడంటే…
ICC CEO: అల్లార్డిస్ రాజీనామా మరొక కారణం, 2024 యూఎస్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్ నిర్వహణలో ఎదురైన సమస్యలు. ఈ టోర్నమెంట్ వ్యయం భారీగా పెరగడం, నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేయడం అతని పద్ధతులపై ప్రశ్నార్థకాలను రేకెత్తింది. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే సమస్యలు రావచ్చని భావించి, అల్లార్డిస్ ముందుగానే వైదొలగినట్లు తెలుస్తోంది.
అల్లార్డిస్ రాజీనామాతో ICCలో మార్పులు స్పష్టమవుతున్నాయి. గతంలో మను సాహ్నీ సీఈఓ పదవి నుంచి తొలగించబడిన సంఘటన తెలిసిందే. అప్పుడు అల్లార్డిస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు స్వీకరించి, 2021లో పూర్తి స్థాయి సీఈఓ నియమితుడు అయ్యాడు. ఇప్పుడు అతని రాజీనామాతో, ఐసీసీ కొత్త సీఈఓ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఇక విషయంపై ఐసీసీ చైర్మన్ జై షా మాట్లాడుతూ, అల్లార్డిస్ ప్రపంచ క్రికెట్ మెరుగుపడేందుకు సహకరించడం అందరిలో కీలకమైన వ్యక్తి అని అతని సేవలకు కృతజ్ఞతలు తెలిపాడు.
2017 తర్వాత మొదటిసారి జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పటికీ అనేక అనిశ్చిత పరిస్థితుల్లో ఉంది. పాకిస్థాన్ సమయానికి స్టేడియం లను సిద్ధం చేస్తుందా? భద్రతా ఏర్పాట్లు పూర్తి అవుతాయా? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లేవు. ఈ పరిస్థితుల్లో, ఐసీసీ కొత్త సీఈఓ గా నియమితులయ్యే వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు అన్నది ఆసక్తికరంగా మారింది.