Ibomma: ప్రముఖ స్ట్రీమింగ్ వెబ్సైట్ ఐబొమ్మ తమ సేవలను భారతదేశంలో పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ఒక అధికారిక సందేశం విడుదల చేసింది. ఇటీవల తమ గురించి వివిధ వార్తలు వినిపిస్తున్న సందర్భంలో, మొదటి నుంచి తమను నమ్మి ఉపయోగించిన వినియోగదారులకు సంస్థ ధన్యవాదాలు తెలిపింది.
అయితే, సేవలను నిలిపివేయాల్సి వచ్చినందుకు వారు విచారం వ్యక్తం చేస్తూ, దీనివల్ల అసౌకర్యం కలిగిన వారికి క్షమాపణలు కోరారు. దేశంలో ఇకపై ఐబొమ్మ ప్లాట్‌ఫారమ్ అందుబాటులో ఉండదని స్పష్టంచేశారు.

