Hydraa: కోహెడలోని రాజాజీనగర్ లేఅవుట్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై బుధవారం హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లేఅవుట్‌లో నివసిస్తున్న పలువురు స్థానికులు, సామ్రెడ్డి బాలారెడ్డి అనే వ్యక్తి వారి ప్లాట్లను అక్రమంగా ఆక్రమించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజావాణి కార్యక్రమంలోనూ ఈ విషయంపై ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బాలారెడ్డి నకిలీ పత్రాలను వినియోగించి దాదాపు 190 ప్లాట్లతో కూడిన 17 ఎకరాల లేఅవుట్‌లో పార్కులు, రోడ్లను కూడా అతిక్రమించారని బాధితులు ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Congress MP: గోవాలో పర్యాటకుడిగా ఉండండి, నివాసిగా మారకండి… ఎంపీ కీలక వాక్యాలు
మొదటిదశలో HYDRAA అధికారులు స్పందించి, ఆక్రమణలను తొలగించారు. అంతర్గత రోడ్లపై నిర్మించిన అనధికార నిర్మాణాలను కూల్చివేశారు. అయితే, బాలారెడ్డి తిరిగి నిర్మాణానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు అతనిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, బాలారెడ్డి వారిపై దాడికి దిగాడని ఆరోపణ. బాధితుల్లో ఒకరు తీవ్రంగా గాయపడగా, అతని తలపై 12 కుట్లు పడ్డాయని కమిషనర్‌కు తెలిపారు.
ఈ విషయంపై స్పందించిన కమిషనర్ రంగనాథన్ మాట్లాడుతూ,
“అక్రమ ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తాం. అసలు లేఅవుట్‌కు అనుగుణంగా రోడ్లు, పార్కులను రక్షించబడతాయి. దాడి ఘటనపై సామ్రెడ్డి బాలారెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి.”
అంతకుముందు, రంగనాథన్ కోహెడలో ఇటీవల నిర్మించిన చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా, తమ ఆస్తులు చెరువులో మునిగిపోయాయని ఫిర్యాదులు చేసిన స్థానికులతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడారు. సమస్యలపై తక్షణ స్పందన ఇవ్వనున్నట్లు అధికారులు హామీ ఇచ్చారు.