Hyderabad: బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ఈ సారి 9404348431 నంబర్ నుంచి ఫోన్ చేసి, “సాయంత్రం వరకు చంపేస్తాం, ఎవరు కాపాడుతారో చూద్దాం” అంటూ హెచ్చరించినట్లు సమాచారం. దీంతో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది రఘునందన్ రావుకు వచ్చిన ఆరో బదిరింపు కాల్. గతంలోనూ ఛత్తీస్‌గఢ్‌లోని ‘ఆపరేషన్ కగార్’ను ఆపాలని మావోయిస్టుల పేరుతో బెదిరింపులు చేశారు. అలాగే, హైదరాబాద్‌లోనే మా టీమ్ ఉందని, తక్షణమే చంపేస్తామని రెండు వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్ చేసిన ఘటనలూ చోటుచేసుకున్నాయి.
గత కొన్ని రోజులుగా వస్తున్న ఈ తరహాకాల్స్‌పై పోలీసులు తీవ్రవాద కోణంతో పాటు ఇతర అనుమానాస్పద కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రఘునందన్ రావు ఈ సారి కూడా అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.