Hyderabad: హైదరాబాద్ పబ్బులో కానిస్టేబుల్ ను కాల్చిర్రు..

Hyderabad: హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో శనివారం సాయంత్రం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. పోలీసులు పాత నేరస్తుడు ప్రభాకర్‌ను పట్టుకునేందుకు పబ్‌కు వెళ్లగా, ఆయన పోలీసులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సైబరాబాద్‌ సీసీఎస్‌ కానిస్టేబుల్‌ వెంకట్‌రెడ్డి, పబ్‌ బౌన్సర్‌ గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనతో పబ్‌లో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *