Hyderabad: మద్యం ప్రియులు జాగ్రత్త.. పబ్బులు బార్లపై పోలీసుల ప్రత్యేక నిఘా

Hyderabad: న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్స్‌పై హైదరాబాద్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, ఉప్పల్‌, రాజేంద్రనగర్‌, రాయదుర్గం, నార్సింగి, ఫిల్మ్‌నగర్‌, సరూర్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో ఉన్న పబ్‌లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.

వేడుకల పేరుతో డ్రగ్స్‌ వినియోగాన్ని అరికట్టేందుకు యజమానులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్‌ ఫ్రీ వేడుకలు నిర్వహించాలని, ఈ విషయంలో కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే, డ్రగ్స్‌ సరఫరా లేదా వినియోగంపై నిఘా ఉంచామని పేర్కొన్నారు. పబ్‌ యజమానుల నుంచి ఈ విషయంలో బాధ్యత వహిస్తామని అండర్‌టేకింగ్‌ తీసుకున్నారు.

ఈ చర్యల ద్వారా న్యూ ఇయర్‌ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మరియు డ్రగ్స్‌ వంటి అనర్థాలను అరికట్టేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana High Court: తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్‌ సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *