Hyderabad: : బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ల విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి (గురువారం) వాయిదా వేసింది. ఈరోజు విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, తదుపరి విచారణను రేపటికి కొనసాగించాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ల పెంపు, జీవోపై ఉన్న స్టే, అలాగే అసెంబ్లీ ఆమోదం వంటి అంశాలపై ప్రభుత్వ తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇక పిటిషనర్లు రిజర్వేషన్లు రాజ్యాంగ పరిమితులను అతిక్రమిస్తున్నాయని వాదించారు.