CM Revanth Reddy:హైదరాబాద్ నగరంలో మనదేశంలోని నగరాలతో పోటీ పడాలని కోరుకోవడం లేదని, న్యూయార్క్, లండన్, పారిస్, టోక్యో, సియోల్ వంటి ప్రపంచ మేటి నగరాలతో పోటీ పడాలని కోరుకుంటున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ముందుగా మొక్కను నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
CM Revanth Reddy:చిన్నదేశమైన సౌత్‌కొరియా ఒలింపిక్స్‌లో అనేక పతకాలు సాధిస్తూ వస్తుందని, అతిపెద్దదైన మనదేశం ఒక్క బంగారు పతకమైనా సాధించలేకపోతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. అందుకే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేయాలన్నదే తన కోరిక అన్నారు. హైదరాబాద్‌ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాలని, తెలంగాణను ప్రపంచంలోని ప్రతి బాగానికి తీసుకెళ్లడానికి మీ సాయం కావాలని పిలుపునిచ్చారు.
CM Revanth Reddy:నాయకుడిగా ఎదగాలంటే త్యాగం, ధైర్యం అనే రెండు విలువల గురించి తెలుసుకోవాలని సూచించారు. ధైర్యంతో త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటే జీవితంలో తప్పక విజయం సాధిస్తారని చెప్పారు. ఎంతటి గొప్ప నాయకుడైనా ధైర్యం ముఖ్యమని, తెలివితేటలు, నైపుణ్యం, కష్టపడి పనిచేయడంతో పాటు అదృష్టం కూడా అవసరమని అన్నారు.