Ramchander Rao

Ramchander Rao: కాంగ్రెస్ గుర్తుపై మజ్లిస్ పోటీ.. రామచందర్ రావు సంచలన కామెంట్స్

Ramchander Rao: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పోటీ చేస్తుందా? మజ్లీస్ పోటీ చేస్తుందా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గుర్తుపైన మజ్లీస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి గతంలో మజ్లీస్ నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మజ్లీస్ అధినేతను కలిశారని…జూబ్లీహిల్స్ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. రామచందర్ రావు సమక్షంలో ఖమ్మం, దేవరకొండకు చెందిన పలువురు వైద్యులు, వ్యాపారవేత్తలు బీజేపీలో చేరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనను జూబ్లీ హిల్స్ ప్రజలు చూశారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ ను, నగరాన్ని అధ్వానంగా తయారు చేశాయని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థిని ఇవాళ రాత్రికి లేదా రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఎంతో ప్రత్యేకత కలిగిన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో గెలుపు జెండా ఎగురవేసేందుకు అన్ని పార్టీలు శాయశక్తులు ఒడ్డుతున్నాయి. భవిష్యత్‌ రాజకీయ మనుగడకు కొలమానంగా మారడంతో ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు.. ఏ చిన్న అవకాశాన్ని వదలుకోకుండా ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధం అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Sankranthiki Vasthunnam Remake: హిందీలో సంక్రాంతికి వస్తున్నాం.. సక్సెస్ అవుతుందా?

వ్యూహ ప్రతివ్యూహాలు.. ఎత్తులు.. పై ఎత్తులతో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచి స్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఉపఎన్నికలు ఒక రకంగా రెఫరండం లాంటివి కావడంతో ఆచితూచి అడుగులు వేస్తోంది

బీఆర్ఎస్ కు సిట్టింగ్‌ స్థానం జూబ్లీహిల్స్‌. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ ది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరణించారన్న సానుభూతితో పాటు ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకుంది గులాబీ పార్టీ. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ….గెలుపు కోసం వ్యూహ రచన చేస్తోంది. అటు బీజేపీకూడా ఈ స్థానంపై కన్నేసింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంటు స్థానంలోని నియోజకవర్గం కావడంతో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది బీజేపీ. చూడాలి మరి ఏం జరుగుతుందో.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *