Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవిత ప్రస్థానం వెండితెరపైకి రాబోతోంది. ఆయన జీవితం, రాజకీయ ప్రయాణం ఆధారంగా రూపొందుతున్న ఈ బయోపిక్‌కి ‘శ్రీనన్న అందరివాడు’ అనే టైటిల్ ఖరారు చేశారు.
ఈ చిత్రంలో పొంగులేటి పాత్రను ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ పోషించనుండటం విశేషం. సుమన్‌కి ఇది 103వ చిత్రం కావడం మరో ప్రత్యేకత. సాధారణ స్థాయి నుంచి కీలక నేతగా ఎదిగిన పొంగులేటి పోరాటం, ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారు.
ఈ చిత్రానికి బయ్య వెంకట నర్సింహ రాజ్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. నటీనటుల జాబితా, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
తెలుగుతో పాటు ఈ చిత్రం హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, అస్సామీ భాషల్లోనూ తెరకెక్కనుంది. దాంతో, పొంగులేటి జీవిత గాథ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది.