HYD

HYD: మరో బాలుడి ప్రాణం తీసిన లిఫ్ట్

HYD: హైదరాబాద్ లోని పలు అపార్ట్‌మెంట్లలో నాసిరకం లిఫ్ట్‌లు ప్రాణాలు బలిగొంటున్నాయి. ఆసిఫ్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధి సంతోష్‌నగర్‌కాలనీలో ముజ్తాబా అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్‌ చనిపోయాడు. అపార్ట్‌మెంట్‌లో తల్లిదండ్రులు, సోదరితో చిన్నారి సురేందర్‌ ఉంటున్నాడు. తండ్రి శామ్‌ బహదూర్‌ ఇక్కడే వాచ్ మెన్‌గా చేస్తున్నాడు. 6 అంతస్తులున్న భవనంలో వసతిగృహం నిర్వహిస్తున్నారు. శామ్‌ బహదూర్‌ లిఫ్ట్‌పక్కనే ఉన్న చిన్నగదిలో ఉంటున్నారు.

సురేందర్‌ ఆడుకుంటూ లిఫ్ట్‌ తలుపు మధ్యకు వెళ్లగా.. ఎవరూ గుర్తించలేదు. 10 నిముషాల తర్వాత సురేందర్‌ ఎక్కడున్నాడని వెతకగా.. లిఫ్ట్‌మధ్యలో ఇరుక్కుని రక్తపుమడుగులో అపస్మారకస్థితిలో ఉన్నాడు. తల్లిదండ్రులు రోదిస్తుండగానే.. అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడిని హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారు.

దీంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వీరు నేపాల్‌ నుంచి జీవనోపాధి నిమిత్తం 7నెలల క్రితం నగరానికి వచ్చారు. మొదలు గుడిమల్కాపూర్‌లో నిర్మాణంలో ఉన్న భవనానికి వాచ్ మెన్‌గా పనిచేశాడు. 3 నెలల క్రితం ముజ్తాబా అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. ఇటీవల వరుసగా లిఫ్ట్‌ ప్రమాదాలు జరుగుతున్నాయి. నాంపల్లిలో ఇటీవల లిఫ్ట్‌, అపార్ట్‌మెంట్‌ గోడకు మధ్య చిక్కుకుని ఆరేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. రెండు రోజుల కిందట రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్‌ కమాండెంట్ గంగారాం లిఫ్ట్‌ ప్రమాదంలో చనిపోయాడు.

Also Read: CM Revanth Reddy: బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి!

HYD: హైదరాబాద్ నగరంలో ఈ తరహా ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు అప్రమత్తం అవ్వాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలి. మెయింటెన్స్‌కి సంభందించి టెక్నికల్ ప్రాబ్లమ్ లేకుండా అపార్ట్ మెంట్ యాజమాన్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే కాదు పిల్లల పట్ల తమ తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఈ రెండేళ్లబాలుడు లిఫ్ట్ మధ్యలో చిక్కుకుని తీవ్ర రక్కస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిబంధనలుకు విరుద్దంగా అనేక అపార్టుమెంట్లలో, కమర్షియల్ కాంప్లెక్స్‌‌లో లిప్టులు నిర్వహించడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్గలు వరకు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. 15 రోజుల్లో ఇదే ఏరియాలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు.

ALSO READ  Road Accident: జహీరాబాద్‌, బీదర్‌ రహదారిపై ఘోర ప్రమాదం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *