Suicide: ఏలూరు నగరంలోని శ్రీవల్లి అపార్ట్మెంట్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇందులో భార్య చిన్నిదేవిక ప్రాణాలు కోల్పోగా, భర్త సురేంద్ర పరిస్థితి విషమంగా ఉంది.
భర్త పుట్టినరోజు కారణమా?
ప్రాథమిక సమాచార ప్రకారం, భర్త పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు చెప్పలేదనే చిన్న కారణంతో దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. దేవిక ఉరేసుకున్న దృశ్యాన్ని చూసి భర్త సురేంద్ర తట్టుకోలేక బ్లేడ్‌తో చేతులు, కాళ్లపై నరాలు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. రక్తంతో నేలపై “I Love You దేవికా” అని రాసినట్లు పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Dosa: ఏపీలో దారుణం.. దోశ గొంతులో ఇరుక్కుని రెండేళ్ల బాలుడు మృతి
బాధితుల కుటుంబం వివరాలు
దేవిక ఉంగుటూరు మండలం నల్లమడు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్‌గా, సురేంద్ర అదే మండలం రాచూరు హైస్కూల్ హెడ్మాస్టర్గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సురేంద్రను బంధువులు వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పోలీసుల దర్యాప్తు
దేవిక మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే కావడంతో ఈ ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

