Telangana: ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ అధికారులు రైతులను వేధింపులకు గురి చేస్తూ తప్పుడు కేసులు నమోదు చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండోవ రోజు కు చేరుకుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహాన్యూస్ తో మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులు ఓ మాఫియాల ఏర్పడి రైతులను వేధిస్తూ ..అమాయక రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు..ఫారెస్ట్ అధికారుల పై చర్యలు తీసుకొనే వరకు తన దీక్ష కొనసాగిస్తానన్నారు…ఎమ్మెల్యే హరీష్ దీక్ష పై ఫారెస్ట్ అధికారులు స్పందిస్తూ తాము రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదన్నారు.
