IND VS NZ

IND VS NZ: మూడో టెస్ట్కు టీమిండియాలో మార్పులు తప్పవా?

IND VS NZ: న్యూజిలాండ్ తో వాంఖడే వేదికగా  జరిగే చివరి టెస్టుకు టీమిండియాలో పలు  మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ టెస్టు అనంతరం టీమిండియా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నది. ఈ క్రమంలో మూడో టెస్టులో మరోసారి మార్పులు చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టులోనూ మూడు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్, కుల్‌దీప్‌, సిరాజ్‌ స్థానాల్లో… గిల్, సుందర్, ఆకాశ్‌కు అవకాశం దక్కింది. కానీ, భారత్‌కు మాత్రం ఓటమి తప్పలేదు. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలనే లక్ష్యంతో టీమ్‌ఇండియా ఆడనుంది.

IND VS NZ: వర్క్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మూడో టెస్టు మ్యాచ్ నుంచి  జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి.. ఆకాశ్‌దీప్‌తో పాటు సిరాజ్‌ తో  బౌలింగ్‌ దాడిని ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.  ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌కు ఎక్కువ సమయం లేకపోవడంతో  ఈ  క్రమంలో బుమ్రాకి రెస్ట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు టెస్టుల్లో బుమ్రా 3 వికెట్లు మాత్రమే తీశాడు. సిరాజ్‌ కూడా ఒక టెస్టులో 2 వికెట్లు పడగొట్టాడు.  అందుకే తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపించని మహ్మద్ సిరాజ్‌ను రెండో టెస్టుకు పక్కన పెట్టారు. ఇప్పుడు చివరి మ్యాచ్‌ కోసం అతడిని తీసుకుంటారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. తొలి టెస్టులో గాయపడిన రిషభ్‌ పంత్ రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతాడని ఎవరూ ఊహించలేదు. కానీ, వేగంగా కోలుకున్న అతడు పుణె టెస్టులోనూ ఆడాడు. పంత్‌పై మరీ ఎక్కువ భారం మోపకుండా ఉండాలనే ఉద్దేశంతో చివరి మ్యాచ్‌కు పక్కన పెట్టే అవకాశాలున్నాయి. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇవ్వనుందని సమాచారం. సబ్‌స్టిట్యూట్‌ వికెట్‌ కీపర్‌గా అతడు ఇప్పటికే ఈ సిరీస్‌లో సేవలు అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూర్తిస్థాయిలో బరిలోకి దిగనున్నాడు. అయితే, పంత్ సెంచరీ సాధించి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 137 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌లోనూ ఆ లోటును ధ్రువ్‌ పూరించాల్సి ఉంటుంది.

IND VS NZ: న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ కోసం నలుగురు స్పిన్‌ ఆల్‌రౌండర్లను భారత్ ఎంపిక చేసింది. ఇందులో ముగ్గురికి ఆడే అవకాశం లభించింది. రవీంద్ర జడేజా, అశ్విన్, వాషింగ్టన్ సుందర్ ఆడిన సంగతి తెలిసిందే. జట్టులో ఉన్నప్పటికీ అక్షర్‌ పటేల్‌కు మాత్రం ఛాన్స్‌ రాలేదు. ఇప్పుడు మూడో టెస్టులో అతడిని బరిలోకి దింపాలని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇచ్చి.. అతడి స్థానంలో అక్షర్‌ను ఆడించనుందని తెలుస్తోంది. జడేజా రెండు మ్యాచుల్లో 6 వికెట్లు తీయడంతోపాటు లోయర్‌ ఆర్డర్‌లో విలువైన 85 పరుగులు సాధించాడు. జట్టు విజయం సాధించకపోయినా అతడి ప్రదర్శన మాత్రం ఫర్వాలేదు. ఈ నేపథ్యంలో భారత జట్టులో మార్పులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *