Trivikram Srinivas: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ‘లక్కీ భాస్కర్’ మూవీ దీపావళి కానుకగా ఈ నెల 31న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘పెళ్ళి చూపులు’ తర్వాత తొలి అడ్వాన్స్ చెక్ తనకు సితార సంస్థ నుండే వచ్చిందని విజయ్ దేవరకొండ చెప్పాడు. విజయ్ భాస్కర్ తన లక్కీ ఛార్మ్ అని దుల్కర్ తెలిపారు. దుల్కర్ తొలి తెలుగు సినిమా ‘మహానటి’లో విజయ్ దేవరకొండ ఓ ప్రధాన పాత్రను పోషించాడు. ఈ సందర్భంగా మమ్ముట్టీ లాంటి గొప్ప నటుడి కొడుకుగా పుట్టిన దుల్కర్… తనదైన ముద్రను వేసుకుంటూ చిత్రసీమలో సాగడం గ్రేట్ అంటూ త్రివిక్రమ్ అభినందించారు. ఇలాంటి నటులతో కలిసి సినిమాలు చేయడం, వారి సినిమాలను చూడటం లక్కీ అని అభిప్రాయపడ్డారు. ఇదే వేదికపై తాను రీమేక్ చేయాల్సి వస్తే. తాను పుట్టిన సంవత్సరంలో వచ్చిన నాగార్జున ‘శివ’ చిత్రాన్ని చేస్తానని విజయ్ దేవరకొండ చెప్పడం విశేషం.
