Horoscope Today:
మేషం
మనసుకు శాంతి లభిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా అవుతాయి. కుటుంబంతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొని ఆనందిస్తారు. ఆదాయానికి తగ్గట్టే ఖర్చు ఉంటుంది. ప్రయాణాలు అనుకూలం. శివనామ స్మరణ మంచిది.
వృషభం
పలుకుబడి పెరిగే పనులు చేపడతారు. ముఖ్యమైన విషయాల్లో ముందడుగు వేస్తారు. స్నేహితులు, బంధువులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన శుభఫలితాలు ఇస్తుంది.
మిథునం
ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. సహచరులతో కలసి ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జాగ్రత్త పడాలి. దుర్గాధ్యానం మీకు శక్తినిస్తుంది.
కర్కాటకం
కృషికి తగ్గ ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం కీలకంగా ఉంటుంది. బంధువుల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. ఈశ్వర దర్శనం శ్రేయస్కరం.
సింహం
ప్రతిష్ట పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకర క్షణాలు పంచుకుంటారు. ఆలస్యం, బద్ధకం దూరంగా ఉంచుకోవాలి. శనిజపం మేలు చేస్తుంది.
కన్యా
కొన్ని విషయాలు ఆలస్యంగా నెరవేరే అవకాశం ఉంది. పెద్దలతో గౌరవంగా, సహనంతో వ్యవహరించాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణం మేలు చేస్తుంది.
ఇది కూడా చదవండి: They Call Him OG Review: ఓజీ మూవీ రివ్యూ.. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి.. బొమ్మ అదిరిపోయింది..!..
తులా
బుద్ధిబలంతో సమస్యలను పరిష్కరించగలుగుతారు. మీ కృషికి ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంలో సత్సమాధానం నెలకొంటుంది. శివనామ స్మరణ శుభప్రదం.
వృశ్చికం
శుభకార్యక్రమాల్లో పాల్గొని ఆనందిస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయాలు సాధిస్తారు. శత్రువులపై ఆధిపత్యం చూపుతారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శ్రేయస్కరం.
ధనుస్సు
ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. స్నేహితుల, సహచరుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. ఇష్టదైవ స్తోత్రం చదవడం శుభకరం.
మకరం
ఆలస్యమైన పని కూడా పూర్తి అవుతుంది. ముఖ్యమైన విషయాల్లో అభివృద్ధి జరుగుతుంది. అందరినీ కలుపుకొని ముందుకు సాగితే విజయాలు దగ్గరలోనే ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇష్టదైవ ధ్యానం ఉత్తమం.
కుంభం
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వాదప్రతివాదాలకు దూరంగా ఉండటం మేలు చేస్తుంది. గోసేవ చేయడం ద్వారా శుభఫలితాలు పొందుతారు. కొంత మనశ్శాంతి లోటు ఉన్నా సూర్య నమస్కారం శక్తిని ఇస్తుంది.
మీనం
ధనవ్యయం ఎక్కువగా ఉంటుంది. కొంత ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. ఇతరులను అతిగా నమ్మకండి. శని శ్లోకం చదవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.