Anandhi: ‘ఈ రోజుల్లో’ సినిమాలో ఓ పాటలో మెరిసి, ఆ పైన ‘బస్టాప్’ మూవీలో హీరోయిన్ గా చేసింది ఆనంది. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది. ఆ మధ్య తమిళ సహాయ దర్శకుడిని పెళ్ళాడిన ఆనంది ఆ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తోంది. ఆ మధ్య ‘జాంబిరెడ్డి’లోనూ, ‘శ్రీదేవి సోడాసెంటర్’లోనూ నటించిన ఆమె కాస్తంత విరామం తర్వాత ఇప్పుడు ‘భైరవం’ సినిమాలో కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాలో ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను విజయ్ కనకమేడల దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలానే శుక్రవారమే ఇందులో నటిస్తున్న మరో హీరోయిన్ దివ్యా పిళ్ళై ఫస్ట్ లుక్ నూ విడుదల చేశారు. దివ్యా పిళ్ళై ‘పూర్ణిమ’ అనే పాత్ర చేస్తుండగా, ఆనంది ‘నీలిమా’ నటిస్తోంది.
Introducing the mesmerizing @anandhiactress 👑 as the 𝐓𝐞𝐥𝐮𝐠𝐢𝐧𝐭𝐢 𝐀𝐧𝐝𝐡𝐚𝐦 ‘Neelima’ from the intense world of #Bhairavam 🔱
She will light up the big screens with her astounding performance ✨@BSaiSreenivas @HeroManoj1 @IamRohithNara @AditiShankarOfl… pic.twitter.com/W7iG2DvLDO
— BA Raju’s Team (@baraju_SuperHit) November 15, 2024