sheikh Rasheed

Sheikh Rasheed: రషీద్‌ డబుల్‌ … ఆధిక్యంలో ఆంధ్ర

Sheikh Rasheed: భవిష్యత్ ఆశాకిరణంగా కితాబందుకున్న యువ సంచలనం, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు రషీద్ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. హైదరాబాద్ పై 203 పరుగులతో ఆకట్టుకున్నాడు. కరణ్‌ శిందే సైతం 109 పరుగులతో సెంచరీ సాధించడంతో ఆంధ్ర కుదుటపడింది. 2 వికెట్లకు 168 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 448 పరుగులు సాధించింది. హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకు ఆలౌట్ కాగా, ఆంధ్రకు 147 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. హైదరాబాద్‌ బౌలర్లలో సి.వి.మిలింద్‌ 2, రక్షణ్‌రెడ్డి 2, అనికేత్‌రెడ్డి 4 వికెట్లతో రాణించగా..తనయ్‌ త్యాగరాజన్‌ 1 వికెట్ తీసుకున్నాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  CPI: సుడా చైర్మన్‌ పదవిపై కన్నేసిన సీపీఐ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *