AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిల కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ మంగళవారం జరిగింది. సిట్ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణను మే 22వ తేదీకి వాయిదా వేసింది.
ఈ కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్, గోవిందప్ప బాలాజీ సహా ఏడుగురిని సిట్ అరెస్ట్ చేసింది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించడంతో, సిట్ అధికారులు వారిని అరెస్ట్ చేసి, విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు, వీరిని మే 20వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది.
ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 28 మంది మావోయిస్టులు మృతి
సిట్ దర్యాప్తులో, ఈ ఇద్దరు నిందితులు లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. వారి కస్టడీ ద్వారా మరింత సమాచారం సేకరించేందుకు సిట్ కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేసింది. కోర్టు విచారణను వాయిదా వేయడంతో, తదుపరి విచారణ మే 22న జరగనుంది.
ఈ కేసు మొత్తం విలువ రూ.3,200 కోట్లుగా అంచనా వేయబడుతోంది. దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.