Harish Rao:సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కురుమూర్తి గుడికి తడిబట్టలతో ఇద్దరం వెళ్దామా? ఎవరి హయాంలో పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోలేదో? ఇద్దరం దేవుడిపై ప్రమాణం చేద్దామా? నేను రెడీ.. నువ్వు రెడీనా? అంటూ హరీశ్‌రావు సవాల్ విసిరారు. తడిబట్టలతో మహిమాన్విత కురుమూర్తి స్వామిపై ప్రమాణం చేద్దామని అన్నారు.
Harish Rao:ఈ రోజు (జనవరి 26)న నారాయణపేటలో సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు పథకాలను ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచలో రేవంత్‌రెడ్డి రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతోపాటు రేషన్‌కార్డుల జారీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశరు. ఆ ప్రభుత్వంలో కుటుంబ పాలన నడిచిందని, పాలమూరు జిల్లాలను, ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు.
Harish Rao:సీఎం రేవంత్‌రెడ్డికి దేవుడిపై నమ్మకం ఉంటే కురుమూర్తి ఆలయానికి రావాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రెండు దశాబ్దాలపాటు పాలమూరు ప్రాజెక్టులకు వారే మోసం చేశారని విమర్శించారు. టీడీపీ పదేండ్లు, కాంగ్రెస్ హయాంలో మరో పదేండ్లపాటు ప్రాజెక్టులను మోసం చేశారని ధ్వజమెత్తారు. అసలు రేవంత్‌రెడ్డి మాటల్లో నిజం లేదని, కొడంగల్‌లో ప్రశ్నించిన పాపానికి రైతులకు బేడీలు వేయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు.
Harish Rao:పాలమూరు జిల్లాలో కురుమూర్తి దేవుడు అంటే అందరికీ నమ్మకమని, చాలా పవర్‌ఫుల్ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొండంగల్ పక్కనే ఉంటదని చెప్పారు. ఆ టెంపుల్‌కు ఇద్దరం వెళ్దామని.. ఎవరు పారుమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారో తేల్చుకుందామని హరీశ్‌రావు సవాల్ విసిరారు.
Harish Rao:20 ఏండ్ల పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది మీరు కాదా? టీడీపీ, కాంగ్రెస్ కాదా? అని హరీశ్‌రావు ఘాటుగా విమర్శించారు. ఆ 20 ఏండ్లలో మీరు సాగునీరిచ్చింది కేవలం 26 వేల ఎకరాలకు మాత్రమేనని, కానీ, కేసీఆర్ సీఎం అయ్యాక 6.5 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో సాగునీటిని పారించామని చెప్పారు. ఇది నిజం కాదా? అని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ మంత్రిగా తాను రాత్రిపూట ప్రాజెక్టుల వద్దే ఉండి.. రాత్రింబవళ్లు పనిచేయించానని హరీశ్‌రావు చెప్పారు.

