HHVM: పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. జూలై 23న రాత్రి 9 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షోలు రూ.708 టికెట్ ధరతో నిర్వహించనున్నారు. జూలై 24 నుంచి 27 వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.531, సింగిల్ స్క్రీన్‌లలో రూ.354 ధరలతో టికెట్లు అందుబాటులో ఉంటాయి. జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.472, సింగిల్ స్క్రీన్‌లలో రూ.302 ధరలు ఉంటాయి. రోజుకు ఐదు షోలతో ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. నైజాంలో ఈ ఉదయం 8 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో, బాబీ డియోల్, నిధి అగర్వాల్ కీలక పాత్రలతో రూపొందిన ఈ చిత్రాన్ని AM రత్నం నిర్మించారు.

