Vastu Tips: చీపురు కర్ర లక్ష్మీదేవితో సమానమని పెద్దలు చెబుతారు. ఇంటిని శుభ్రం చేయడానికి చీపురు చాలా ముఖ్యం. కానీ దానిని కొనుగోలు చేయడానికి, ఇంట్లో ఉంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. చీపురుకు సంబంధించిన కొన్ని నియమాలు వాస్తు శాస్త్రంలో పేర్కొనబడ్డాయి. చీపురు విషయంలో తెలిసి, తెలియక చేసే పొరపాట్లు ఇంట్లోని ధనాన్ని కోల్పోయే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
శనివారం లేదా మంగళవారం చీపురు కొనకండి. ఈ తప్పు చేస్తే ఇంట్లో డబ్బుకు లోటు ఉంటుంది. కొత్త చీపురు కొని పాత చీపురు మంచిరోజు అని చూడకుండా పారేసుకోవద్దు, విసిరే సమయంలో సరైన సమయం, మంచి రోజు చూసుకుని పారేయండి.. సరిగ్గా సరిపోని చీపుర్లను నిల్వ చేయడం మంచిది కాదు.
Vastu Tips: బుధవారం, గురువారం లేదా శుక్రవారం చీపురు కొనడానికి అనుకూలమైన రోజులు. ఈ రోజున కొనుగోళ్లు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటే పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఇంటికి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇంట్లో పాత వస్తువులు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కాబట్టి వాటిని తొలగించడం మంచిది.
ముఖ్యంగా డబ్బు, నగలు పెట్టే ప్రదేశాల్లో చీపురు పెట్టకూడదు. అలాగే వంటగదికి దూరంగా ఉంచాలి. చీపురు మీద కాళ్లతో అడుగు పెట్టకండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని చాలా మంది నమ్ముతారు.