Hardik Pandya: క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచారు. మోడల్ మహికా శర్మతో ఆయన రిలేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. వీరి లవ్ స్టోరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట లవ్ స్టోరీ ఏంటో చూద్దాం.
క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన విడాకుల తర్వాత మహికా శర్మతో డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తున్నారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఈ జంట కలిసి కనిపించడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. తాజాగా హార్దిక్ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ అయితే ఈ వార్తలను నిజం చేశాయి. బీచ్ లో ఆమెతో దిగిన ఫోటో హార్దిక్ తన స్టోరీలో పెట్టగా ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది. అలాగే ఆమెతో దిగిన ఓ క్లోస్డ్ బ్లాక్ & ఫోటో కూడా వైరల్ అవుతుంది. దీంతో వీరి ప్రేమాయణంపై వస్తున్న వార్తలు నిజమని తేలింది. మహికా శర్మ ఓ ప్రముఖ భారతీయ మోడల్, నటి. ఫైనాన్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె, వివో, యూనిక్లో, తనిష్క్ వంటి బ్రాండ్ల కోసం పనిచేసింది. మనీష్ మల్హోత్రా, తరుణ్ తహాలియాని వంటి డిజైనర్ల కోసం ర్యాంప్ వాక్ చేసింది. గత ఏడాది ఇండియన్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో ‘మోడల్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకుంది. ఓ ఫ్యాషన్ షోలో కంటి నొప్పి, హై హీల్స్ విరిగినా ర్యాంప్ వాక్ పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంది. హార్దిక్‌తో ఆమె సంబంధం గురించి వార్తలు గత ఏడాది నుంచి వినిపిస్తున్నాయి. తాజా పోస్ట్ లతో అవి నిజం అయ్యాయి.
View this post on Instagram