Fighter Jet Breaks

Fighter Jet Breaks: గుజరాత్‌లో కూలిన జాగ్వార్ యుద్ధ విమానం..ప్రమాదంలో పైలెట్‌ మృతి

Fighter Jet Breaks: గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం జామ్‌నగర్ సమీపంలోని సువర్ద గ్రామంలో బుధవారం రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ ప్రాణాలు కోల్పోయాడు, మరో పైలట్ గాయాలపాలయ్యాడు. అధికారులు ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించారు.

ప్రమాద వివరాలు

రాత్రి నైట్ మిషన్ శిక్షణలో భాగంగా జాగ్వార్ యుద్ధ విమానాన్ని పైలట్లు నడుపుతుండగా సాంకేతిక లోపం ఏర్పడి ప్రమాదం చోటుచేసుకున్నట్లు భారత వాయుసేన అధికారులు వెల్లడించారు. విమానం కూలిన అనంతరం మంటలు చెలరేగి, కాక్‌పీట్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి.

పైలట్ మృతి – ఎయిర్ ఫోర్స్ ప్రకటన

ఈ ఘటనపై భారత వైమానిక దళం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రాణాలు కోల్పోయిన పైలట్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. గాయపడిన పైలట్‌ను తక్షణమే జామ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: Stock Market: డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు

ఇది కొత్త విషయం కాదు. మార్చిలో హర్యానాలోని పంచకుల సమీపంలో జాగ్వార్ ఫైటర్ జెట్ కుప్పకూలిన ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని తేలింది. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటన జరగడం విమాన రంగంలో ఆందోళన కలిగించే విషయం.

విచారణకు ఆదేశాలు

ఇంత పెద్ద ప్రమాదం జరగడంతో, వాయుసేన దీనిపై దర్యాప్తు చేపట్టింది. ప్రమాదానికి గల కారణాలను తెలియజేసేలా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదం తర్వాత భారత వైమానిక దళంలో వినియోగంలో ఉన్న పాత యుద్ధ విమానాల భద్రతపై చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ALSO READ  Terrorist: ఇండియా ని బెదిరించిన ఉగ్రవాది.. అనుమానాస్పద స్థితిలో మృతి

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *