Google Map:

Google Map: గూగుల్ త‌ల్లి పుణ్య‌మా అని ఎల్తే దిక్కులే మారుతున్న‌య్‌..

Google Map: గూగుల్ త‌ల్లి రూటే సెప‌రేటు. ప్ర‌తి ఒక్క‌లూ ఇప్పుడు గా గూగుల్ త‌ల్లినే ఫాలో అవుతున్నారు. ఆ త‌ల్లి ఎట్ట‌జెప్తే అదే క‌రెక్ట్ అనుకునేలా జ‌నం త‌యారయ్యారు. ఇంకేమి గూగుల్ త‌ల్లి మేము గా దిక్కు పోవాలె.. అంటే ఆ దిక్కు బ‌రాబ‌ర్ జూపిస్త‌ది. గూగుల్ మ్యాప్ పెట్టుకొని తెలియ‌ని ప్లేస్‌ల‌కు జ‌నాలు ఇట్టే ప‌య‌న‌మైతుండ్రు.

Google Map: కానీ, ఈ మ‌ధ్య‌నే ఒక కారుల ముగ్గురు యువ‌కులు గూగుల్ త‌ల్లి గా రూట్ జెప్పు అని మ్యాప్ ఆన్ జేసిండ్రు. ఇంగేముంది. గూగుల్ మ్యాప్ రూప్ సెట్ జేసింది. ఇగ గా దిక్కే ఆళ్లు పోబ‌ట్టే. బ‌గ్గ స్పీడ్ పోబ‌ట్టిర్రు. ఓ బిడ్జొచ్చింది. ఆ బిడ్జి మీంచి స‌రాస‌రి పోనిచ్చిర్రు. ఇంగేముంది.. స‌క్క‌గ బోయి వాగుల ఆ కారు ఇరుక్కుపోయింది. ఆ ముగ్గురూ పాణాలిడిసిర్రు.

Google Map: అస‌లు ఇష‌యం ఏందంటే.. గ‌ది ఎప్పుడో కూలిన బిడ్జి. దాన్నెప్పుడో గూగుల్ తల్లి ఫీడ్ జేయ‌బ‌ట్టె. ఇక గా దిక్కే జూపించ‌బ‌ట్టె. గందుకే ఆ రూటే ఇప్ప‌టికీ గూగుల్ తల్లి మ్యాప్‌లో జూపిస్తుంది. ఇగ జూసిర్రా. కొన్ని మార‌క‌పోతే ఆ గూగుల్ త‌ల్లికేమెర‌క.. న‌మ్ముకొని మ‌న‌మే ఆగ‌మైతుంటిమి.

Google Map: ఇగ ఇంకోకాడ ఇదే జ‌రిగింది. కాకుంటే ఆళ్ల పాణాలకేం గాలే. ఏమైందంటే? బీహార్ రాష్ట్రానికి చెందిన రాజ్‌దాస్ రంజిత్‌దాస్ కుటుంబం కారులో గోవా బ‌య‌ల్దేరింది. ఆ కారులో ఆరుగురు ఉన్న‌రు. ఆళ్ల‌ల్ల చిన్నోళ్లు కూడ ఉన్న‌రు. గూగుల్ త‌ల్లిని న‌మ్ముకొని మ్యాప్ బెట్టుకుండ్రు. ఇగ బ‌గ్గ బ‌య‌లెల్లిండ్రు. పోతుండ్రు.. పోతుండ్రు.. పోంగ‌పోంగ ఆ గూగుల్ త‌ల్లి ఏటో తీస్క‌బోయింది. దిగి చుట్టుజూసిండ్రు. గుండె ప‌గిలినంత ప‌నైంది.

Google Map: ఆళ్లు ఎల్లింది ఎటు దిక్క‌నుకుంటున్రు. స‌క్క‌గ అడ‌విల్నే దిగ‌బ‌ట్టిండ్రు. కారును ఆపేసిండ్రు. చుట్టూ ద‌ట్ట‌మైన చెట్లు, కారు చీక‌టి.. బిక్కుబిక్కు మ‌నుకుంటూ కార్లనే ఉన్న‌రు. సిగ్న‌ల్స్ కూడా లేకుండా పోయిన‌య్‌. బ‌య‌ట‌కెళ్లే దారీ లేక‌పోయింది. ఇగ కారు లాక్ చేస్కొని రాత్రంతా అందులోనే గ‌డిపారు. తెల్లార్నంక బ‌య‌ట‌కు బ‌య‌ల్దేరిండ్రు. కొద్దిపేపయ్యాక మెయిన్ రోడ్డెక్కిండ్రు. ఇగ ఆళ్లు ఆ రాత్రంతా ఎక్క‌డుందో తెలుసుకుంటే ఒళ్లు జ‌డుసుకునేంత ప‌నైంది.

Google Map: ఆళ్లు భీమ్‌గ‌ఢ్ వైల్‌లైఫ్ జోన్‌లో 7 కిలోమీట‌ర్ల ల‌ప‌లికి వెళ్లిన్రు. అక్క‌డ అట‌వీ జంతువులు సంచ‌రించే ప్రాంతం అది. ఇగ జూసిండ్రా.. గూగుల్ త‌ల్లి మ్యాప్‌ను న‌మ్ముకుంటే ఇట్ల‌యింది. అమ్మో మ‌ళ్లా పూర్తిగా గూగుల్ త‌ల్లినే న‌మ్ముకోవ‌ద్దు అని చెంప‌లేసుకున్న‌రు. ఇక్క‌డ గూగుల్ మ్యాప్ పూర్తిగా త‌ప్ప‌ని చెప్పట్టే.. ఎప్పుడో ఫీడ్ చేసిన ఆ రూప్‌మ్యాప్ ఉండ‌టం వ‌ల్ల‌, అది అప్‌డేట్ కాక ఇలాంటి స‌మ‌స్య‌లు త‌ర‌చూ ఏర్ప‌డుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *