సీఎం చంద్రబాబు ఏపీ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు.. గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందను విమర్శించారు. రోడ్లపై 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందను అన్నారు. ఏడాది లోపు ఆ చెత్త మొత్తం క్లీన్ చేయించాలని మంత్రి నారాయణను ఆదేశించామన్నారు.
2029 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచినచురు. చెత్త పన్నును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.కొందరు స్వార్థపరులు ఆంధ్ర జాతీయ కళాశాలను ఆక్రమించారను అన్నారు. సర్కార్ దాన్ని స్వాధీనం చేసుకుంటుందన్నారు. జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య పేరు మీద వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు.