TGSRTC

TGSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. దసరా కానుక

TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ఉద్యోగులకు దసరా పండుగ సందర్భంగా శుభవార్త అందింది. పండుగను సంతోషంగా జరుపుకునేందుకు వీలుగా ఉద్యోగులకు అడ్వాన్స్ ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు అధికారులతో సమావేశమై కీలక ఆదేశాలు జారీ చేశారు.

డ్రైవర్లు, కండక్టర్లకు అడ్వాన్స్
ఈ అడ్వాన్స్ సౌకర్యం డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్ వైజర్లు, అలాగే శ్రామిక్‌లకు వర్తిస్తుంది. ఉద్యోగుల నెల జీతం ఆధారంగా ఈ అడ్వాన్స్ మొత్తం ఇవ్వనున్నారు. తర్వాత, ఈ మొత్తాన్ని వారి జీతం నుంచి నెలకు కొంత చొప్పున తిరిగి కట్ చేసుకుంటారు.

లాభాల బాటలో ఆర్టీసీ
టీజీఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి ఉద్యోగులు చేస్తున్న కృషిని యాజమాన్యం గుర్తించింది. అలాగే, తెలంగాణలో మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని కూడా విజయవంతం చేయడంలో ఆర్టీసీ ఉద్యోగులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో, దసరా పండుగకు బోనస్ ఇవ్వాలని కొన్ని రోజులుగా ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. వారి కోరిక మేరకు, యాజమాన్యం ఈ అడ్వాన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో సంతోషం నింపింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *