GHMC Notices

GHMC Notices: నాగార్జున, వెంకటేష్ స్టూడియోలకు GHMC నోటీసులు!

GHMC Notices: తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖ స్టూడియోలైన అన్నపూర్ణ స్టూడియోస్ (నాగార్జున కుటుంబానికి చెందింది), రామానాయుడు స్టూడియోస్ (వెంకటేష్ కుటుంబానికి చెందింది)కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు బిగ్‌ షాక్ ఇచ్చారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎగవేత ఆరోపణలపై GHMC అధికారులు ఈ రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు. స్టూడియోల యాజమాన్యాలు తమ వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపిస్తూ, ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఇతర పన్నులను భారీగా ఎగవేస్తున్నారని GHMC అధికారులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: ENG vs AUS: నేటి నుంచే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మహాపోరు!

అన్నపూర్ణ స్టూడియోస్  వాస్తవానికి రూ. 11.52 లక్షలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ. 49 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రామానాయుడు స్టూడియోస్ రూ. 1.92 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ. 1,900 మాత్రమే చెల్లిస్తున్నట్లు GHMC గుర్తించింది. వ్యాపార విస్తీర్ణాన్ని సరిగా లెక్కించి, తక్షణమే పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు, బకాయిలను చెల్లించాలంటూ GHMC అధికారులు ఈ రెండు స్టూడియోల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై తెలుగు సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *